మామయ్య చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • నేడు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు
  • వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు
  • మామయ్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన తారక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది "గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మావయ్య గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఇదే విధమైన అంకితభావంతో, దార్శనికతతో సేవ చేయడానికి కావలసిన శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను."


Chandrababu Naidu
Nara Chandrababu Naidu
Junior NTR
Andhra Pradesh
AP CM
Telugu Desam Party
Birthday Wishes
Political Leaders
Telugu States

More Telugu News